కాలనీల అభివృద్ధికి సంపూర్ణ సహకారం
10-06-2024 01:28 AM
ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
పటాన్‌చెరు, జూన్ 9: అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కాలనీల అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఉంటుందని ఎమ్మె ల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ఎన్నారై ఆనంద్‌నగర్ కాలనీలో ఆదివారం ఆయన కాలనీ సంక్షేమ సంఘం కమ్మూనిటీ హాల్‌ను ప్రారంభించి మాట్లాడారు. మున్సిపల్‌వాసులకు మౌలిక వసతులు కల్పించేందుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. భవన నిర్మాణానికి సహకారం అందించిన మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్‌ను ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే బీరంగూడలోని గోశాలను సందర్శించారు. పర్యటనలో కౌన్సిలర్‌లు, కోఢూఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.






