21-01-2026 12:07:01 AM
- నీలం మధు ముదిరాజ్
పటాన్ చెరు, జనవరి 20: పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని నూతన దేవాలయాల నిర్మాణానికి పురాతన దేవాలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నానని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. మంగళవారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ ప రిధిలోని లక్డారంలో నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి దేవాలయ స్లాబ్ పనులను ఆయన పరిశీలించారు. అంతకుముం దు కొబ్బరికాయ కొట్టి స్లాబ్ నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ ఆలయాల నిర్మాణాలతో గ్రామాలలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుందని తెలిపారు. అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణం లక్డారంలో చేపట్టడం సంతోషకరమన్నారు. ఆలయ నిర్మాణానికి చొరవ తీసుకున్న ఆలయ కమిటీ సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.