calender_icon.png 21 January, 2026 | 5:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష్మీనర్సింహస్వామి ఆశీస్సులతో పార్టీ బలోపేతం

21-01-2026 12:08:10 AM

డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి 

సిద్దిపేట రూరల్, జనవరి 20: లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో పార్టీ బలోపేతం అవుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురా లు ఆంశారెడ్డి అన్నారు.మంగళవారం సిద్దిపేట రూరల్ మండలంలోని పుల్లూరు బండ జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పార్టీ నాయకులతో కలిసి లక్ష్మీనరసింహస్వా మి కల్యాణోత్సవాలు పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పుల్లూరు క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనదని, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉం డాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఆల య అర్చకులు ఆమెను ఘనంగా సత్కరించారు.ఈ వేడుకల్లో ఆర్టీఏ మెంబర్ సూర్యవ ర్మ, టీపీసీసీ మెంబర్ దర్లిపల్లి చంద్రం, ఆలయ కమిటీ చైర్మన్ కనకయ్య, మండల కాంగ్రెస్ నాయకులు గరిపల్లి రాములు, గరిపల్లి వెంకట్, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, ఐరెని అంజిరెడ్డి, పూల్లూరి శివకుమార్,గుర్రం రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.