16 April, 2026 | 5:58 AM

డాక్టర్ కోట నీలిమ కృషితో సనత్ నగర్ నియోజకవర్గానికి భారీగా నిధులు

09-02-2026 12:34 PM

సనత్‌నగర్,(విజయక్రాంతి): సనత్ నగర్ నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ కృషితో కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తోందని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు. ఇందులో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ.. సోమవారం సనత్ నియోజకవర్గ అభివృద్ధికి 1.68 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. ఆ నిధులతో రూ.16 లక్షలతో రవీంద్ర నగర్ పార్క్ వద్ద రూ.75 లక్షలతో నెహ్రు పార్క్ వద్ద రూ.77 లక్షలతో సనత్ నగర్ బస్ స్టాండ్ వద్ద బీటి రోడ్ల నిర్మాణం చేపట్టినట్టు పేర్కొన్నారు.

నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ కృషితో నియోజకవర్గంలో తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ క్రమంలో సమస్యలను కోట నీలిమ దృష్టికి తీసుకెళ్తున్నామని.. వెంటనే ఆమె స్పందించి సంబంధిత మంత్రులు, అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని వెల్లడించారు. ఇందులో భాగంగా నియోజకవర్గ అభివృద్ధికి వందల కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని తెలిపారు.

కోట నీలిమ సారథ్యంలో సనత్ నగర్ నియోజకవర్గం అన్ని విభాగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గం ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ, ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రమోద్, అడ్డు, నరేష్, అజ్జు, ఖమర్, రవికాంత్ గౌడ్, అశ్విని, అతీక్,ఎలీషా, మణిమాల ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.