calender_icon.png 9 February, 2026 | 2:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాయు కాలుష్యం.. శబ్ద కాలుష్యం నుంచి కాపాడని మహాప్రభో

09-02-2026 12:31:41 PM

కాంట్రాక్టర్ నిర్లక్యం వలన ప్రాణాపాయ స్థితిలో చిన్నారులు

సత్తుపల్లి(విజయక్రాంతి): సత్తుపల్లి ప్రభుత్వ హాస్పిటల్ నందు జరిగే ప్రభుత్వ కట్టడాల వలన పక్కనే ఉన్న గాంధీ నగర్ రోడ్ నెంబర్ 12లో నివసించే ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా చిన్నపిల్లలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అక్కడ ఉండే పసి పిల్లలకు ఆ కట్టడాల నుండి వచ్చే దుమ్ము వలన విపరీతమైన నిమ్ము దగ్గు, జలుబు వంటి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలకు వేలు దారబోసి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ అనేక ఇబ్బందులు పడుతున్నామని లబోదిబోమంటున్నారు. 

కట్టడాల నిర్మాణం చేయిస్తున్న కాంట్రాక్టర్ కు పట్టాలు కట్టి పనులు చేయించండి ఆ దుమ్ము వలన పసి పిల్లలకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అని ఎన్నిసార్లు మొరపెట్టుకున్న వినిపించుకోకుండా అలాగే నిర్లక్ష్యం చేస్తున్నార స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై సత్తుపల్లి శాసన సభ్యురాలు అయిన మట్ట రాగమయి ఎమ్మెల్యే. దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందన్నారు. సమస్యను ప్రభుత్వం చొరవ తీసుకొని సత్తుపల్లి ప్రభుత్వ హాస్పిటల్ చుట్టూ ఉన్న పసి పిల్లలకు ఆరోగ్య సమస్యల నుండి కాపాడాలని కోరుతున్నారు.