calender_icon.png 4 February, 2026 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బకాయిలు చెల్లించాకే ఇతర పథకాలకు నిధులు

04-02-2026 01:17:54 AM

  1. ఫీజు బకాయిలు చెల్లించాలని విద్యార్థులు ఆందోళన
  2. తెలంగాణ విద్యార్థి ఐకాస చైర్మన్ వేముల రామకృష్ణ

ముషీరాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించిన తర్వాతే ఇతర పథకాలకు నిధులు కేటాయించాలని తెలంగాణ విద్యార్థి ఐకాస చైర్మన్ వేముల రామకృష్ణ డిమాండ్ చేశా రు. ఈ మేరకు మంగళవారం నగరంలోని రాజేంద్రనగర్‌లో విద్యార్థుల పెండింగ్ ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు.

ఈ సం దర్భంగా వేముల రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న 8 వేల కోట్ల ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో ఫీజులు చెల్లించాలని కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నా రు. ఫీజులు చెల్లిస్తేనే హాల్ టికెట్లు ఇస్తామని కాలేజ్ యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు రూ.12.75 లక్షల మంది విద్యార్థులు పరీక్షల సమయంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ఆ ప్రభావం పరీక్షలపై పడుతుందన్నారు.

విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారని, ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని కాంట్రాక్టర్లకు బిల్లు లు ఆపి విద్యార్థుల ఫీజుల బకాయిలు చెల్లించాలని వేముల రామకృష్ణ డిమాండ్ చేశా రు. తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమిం చి విద్యాహక్కు చట్టం అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నరేష్, మోహన్, సాయి వెంకట్, వేణు, మోక్షిత్, గోపి, రాజేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.