30-07-2024 06:46:57 PM
హైదరాబాద్: బీఆర్ఎస్ పాలనలో గ్రామీణాభివృద్ధి బాగా జరిగిందని కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు పాలన అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం కావడంలో ఎనిమిది నెలలుగా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారని ప్రభాకర్ అన్నారు. ప్రస్తుతం నిధులు లేక గ్రామాల్లో ఇబ్బందులున్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే నిధులు ఒక్క రూపాయి రాలేదని, గ్రామీణ ప్రాంతాలకు బడ్జెట్ లో నిధులు తగ్గించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదని కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పారు.