30-07-2024 06:24:43 PM
న్యూఢిల్లీ: లోక్ సభలో కేంద్ర బడ్జెట్ పై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం చెబుతున్నారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ స్ఫూర్తితో బడ్జెట్ ప్రవేశపెట్టామన్నారు. 2009-10 బడ్జెట్ లో బిహార్, యూపీకి అధికంగా కేటాయించారు. రెండు రాష్ట్రాలపై ఆరోపణలు చేస్తున్నవారు దానికేం జవాబిస్తారు..? అని ఆమె ప్రశ్నించారు. 2009-10 బడ్జెట్ లో 26 రాష్ట్రాల ప్రస్తామనే నాటి బడ్జెట్ లో పెట్టలేదని, 2010-11 బడ్జెట్ లో 19 రాష్ట్రాలు, 2011-12 బడ్జెట్ లో 15 రాష్ట్రాలు, 2012-13 బడ్జెట్ లో 16 రాష్ట్రాలు, 2013-14 బడ్జెట్ లో 10 రాష్ట్రాలను విస్మసించారు. నాడు రాష్ట్రాలను విస్మరించిన వాళ్లు ఇప్పుడు మిమ్మల్ని విమర్శింస్తున్నారని సీతారామన్ మండిపడ్డారు.
బడ్జెట్ లో కేటాయింపులపై కేంద్రమంత్రలు రాష్ట్ర ప్రజలకు వివరిస్తున్నారన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో రూ.1900 కోట్లతో బల్క్ డ్రగ్ పార్కులు, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు పీఎం మిత్ర టెక్స్ టైల్ పార్కులు కేటాయించామని ఆమె వెల్లడించారు. గ్రీన్ ఫీల్డ్ పార్కులకు రూ.500 కోట్లు, బ్రౌన్ ఫీల్డ్ పార్కులకు రూ.200 కోట్లు కేటాయించామన్నారు. బెంగాల్, ఝార్ఖండ్, బిహర్ రాష్ట్రాలకు మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులు, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాలకు రైల్వే డబ్లింగ్ పనులకు నిధులు కేటాయించామని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలకే అధిక నిధుల కేటాయింపులనేది అవాస్తవం అని ఆమె తెలిపారు. ఏపీ, తెలంగాణలో మోటుమర్రి-విష్ణపురం సెక్షన్లలో రైల్వే డబ్లింగ్ పనులు, భద్రాచలం, డోర్నకల్ సెక్షన్లలో రూ.12,334 కోట్లు రైల్వే పనులకు నిధులు అందించినట్లు సీతారామన్ వెల్లడించారు.