13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

జగన్నాద్ పూర్ ప్రాజెక్టుకు నిధులు కేటాయించారు

23-03-2026 02:43 PM

అసెంబ్లీలో సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు

కాగజ్ నగర్,(విజయక్రాంతి): కాగజ్ నగర్ మండలంలోని జగన్నాథ్ పూర్ సాగునీటి ప్రాజెక్టుకు రూ.135 కోట్లు కేటాయించాలని ఎమ్మెల్యే హరీష్ బాబు డిమాండ్ చేశారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడారు. గత కొన్ని ఏళ్లుగా నిధుల కొరత కారణంగా ప్రాజెక్టు అసంపూర్తిగా నిలిచిందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే కాగజ్ నగర్, దహేగాం మండలాల్లోనూ వేల ఎకరాలకు సాగునీరందే అవకాశం ఉండాలి. నిధులు మంజూరు చేసి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  తగిన చర్యలు తీసుకుంటామని సభకు హామీ ఇచ్చారు.