24 March, 2026 | 7:58 PM

Breaking News

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన   •   జన గణనను పకడ్బందీగా పూర్తి చేయాలి   •   ప్రభుత్వానికి నాణ్యమైన సమాచారం అందించేలా కృషి చేయాలి   •   ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు సత్వర చర్యలు   •   సంత నిర్వాహణ వేలంలో పెరిగిన ఆదాయం 5.02 శాతం మాత్రమే   •   జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం   •   ద్వారకుంటలో సిసి రోడ్డు శంకుస్థాపన: సర్పంచ్ పాలకి సురేష్   •   ఖైదీలకు బెయిల్ విషయంలో సహాయం చేయడమే సాధికార కమిటీ ఉద్దేశ్యం   •   కోనరావుపేట 10వ వార్డ్‌లో పారిశుధ్య సమస్యలు   •   కోదండరామాలయం పరిసరాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు   •  

మధ్యాహ్న భోజనానికి నిధులు కేటాయించాలి

01-12-2024 12:33 AM

ఎస్‌ఎఫ్‌ఐ

హైదరాబాద్, నవంబర్ 30 (విజయక్రాంతి): మధ్యాహ్న భోజనానికి అధిక నిధులు కేటాయించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ ఒక ప్రకటనలో కోరింది. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ శనివారం చేపట్టిన రాష్ట్ర వ్యాప్త ప్రభుత్వ పాఠశాలల బంద్ కార్యక్రమం విజయవంతమైందని అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌ఎల్ మూర్తి, టి.నాగరాజు పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగు చూస్తున్నాయని, ఇప్పటివరకు 930 మందికి పైగా విద్యార్థులు ఆస్పత్రుల పాలయ్యారని వారు పేర్కొన్నారు.