calender_icon.png 23 February, 2026 | 4:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంఘం అభివృద్ధికి నిధులు విడుదల చేయాలి

23-02-2026 01:11:41 AM

కడెం, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి) : హైదరాబాద్ లో బీసీ కులాల ఆత్మగౌరవ భవనాలు కట్టుకోవడం కోసం రాష్ట్ర ప్రభు త్వం నిధులు విడుదల చేయాలని పెరిక పురగిరి క్షత్రిక కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గటిక విజయ్ కుమార్ కోరారు. ఆదివారం కడెం మండలం కొండుకూర్ పవనసుత రైస్ మిల్లులో ఏర్పాటు చేసిన నిర్మల్ జిల్లా పెరిక కుల సంఘం సర్వసభ్య సమావేశానికి వారు హాజరై మాట్లాడారు పెరిక కులస్థుల అభివృద్ధికి పెరిక హాస్టల్, కోకాపేట్ పెరిక బిల్డింగ్,పేద విద్యార్థులకు ఉన్నత చదువులకు సహాయం తదితర కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.

పెరిక కులస్థులు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. గత ప్రభుత్వం హైదరాబాద్‌లో బీసీ కులాలకు కేటాయించిన స్థలాల్లో నిర్మించనున్న ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీసీ కులాలకు కులాల వారీగా నిధులు, రిజర్వేషన్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా కడెంకు చెందిన ముక్కెర శ్రీనివాస్ ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పెరిక సంఘం రాష్ట్ర నాయకులు దొంగరి వెంకటేశ్వర్లు, సుంచు ఉషన్న, సుంకరి ఆనంద్, సందేల లింగన్న, కీత విజయ్ కుమార్, మద్ద లింగన్న, చుంచు భూమన్న, ముక్కెర శ్రీనివాస్ తదితర పెరిక కుల సం ఘం నాయకులు కులస్తులు పాల్గొన్నారు.