07-05-2025 12:20:19 AM
ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ వినయ్‌రెడ్డి
ఆర్మూర్, మే 6 : ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో ఊర చెరువు కింద వర్షాకాలం వర్షం ఎక్కువైనప్పుడు అలుగు పరడం వలన కెనాల్ ద్వారా వెళ్లే నీరు బ్రిడ్జ్ సరిగ్గా లేనందున నీరు రోడ్డుపై నుండి పారడం వలన గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిజామాబాద్ మాజీ గ్రంథాలయ చైర్మన్ మారా చంద్ర మోహన్ ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి కి తెలపగానే అంకాపూర్ విడీసీ సభ్యులు మరియు గ్రామస్థులతో కెనాల్ ని చూడడం జరిగింది.
సంబంధిత ఇరిగేషన్ అధికారులతో పిలిపించి దానికి వెంటనే బ్రిడ్జ్ కు కావలసిన ఎస్టిమేట్లను రెడీ చేసి ఇవ్వవలసిందిగా అధికారులను కోరడం జరిగింది. దీనిని సంబంధిత మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డితో వెంటనే మంజూరు చేపిస్తానని గ్రామస్థులకు హామీ ఇవ్వడం జరిగింది.అంకాపుర్ నుండి ఆర్గుల్ కి వెళ్లే మార్గంలో రోడ్డు మార్గం వంకరలుగా ఉండటం మరియు బావిలు ఉండటం వలన గ్రామస్థుల రాకపోకలకు ఇబ్బందులు గురిఅవుతున్నారని గ్రామస్థులు చెప్పడం జరిగింది.
వెంటనే సంబంధిత అధికారులు పంచాయతీ రాజ్ అధికారి AE కి చెప్పి వంకర లేని రోడ్డు మార్గానికి ఎస్టిమేట్ లను వేయాలని చెప్పడం జరిగింది.వెంటనే సంబంధిత మంత్రి సీతక్కతో మాట్లాడి రోడ్డు కి నిధులను మంజూరు చూపిస్తానని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ సాయి బాబా గౌడ్,వైస్ ఛైర్మన్ జీవన్,మాజి మున్సిపల్ చైర్మన్ పవన్, వెంకట్రామ్ రెడ్డి,అమృత్ రావ్, అనంత్, గ్రామ నాయకులు,కార్యకర్తలు పాల్గోన్నారు.