07-05-2025 12:23:37 AM
ముషీరాబాద్, మే 6 (విజయక్రాంతి): అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ, ఆటో విభాగంలో గత 20 ఏళ్లుగా చేస్తున్న సేవలకు ప్రైవేటు ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ర్ట ప్రధాన కర్యదర్శి గోదా మల్లేష్‌గౌడ్ శ్రమశక్తి పురస్కారం-25ను అందుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీయూసీలో వివిధ హోదాల్లో 20 ఏళ్లు ఆటోడ్రైవర్లకు సేవలందిస్తూ కర్మికుల సమస్యల కోసం నిరంతరం పోరాడుతున్న తనను కాంగ్రెస్ పార్టీ, ఐఎన్టీయూసీ గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేయడం అభినందనీయమన్నారు.
ఈ పురస్కారం తనకు మరింత భాద్యతను పెంచిందని రాబోయే రోజుల్లో యూనియన్ పటిష్టతకు, కార్మికుల హక్కుల కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. తనను గుర్తించి ఈవార్డుకు ఎంపిక చేసిన కాంగ్రెస్ పార్టీ, సీఎం రేంవత్‌రెడ్డి, ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జీ సంజీవరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.