07-05-2025 12:19:45 AM
-బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు శేరి రాజు
చేవెళ్ల, మే 6: తెలంగాణ రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా ప్రజలు, ఉద్యమ కారులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని బీఆర్‌ఎస్ నాయకుడు, తెలంగాణ ఉద్యమ కారుడు శేరిరాజు అన్నారు. మంగళ వారం ఆయన చేవెళ్లలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
శేరి రాజు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉద్యమ కారులకు ప్రభుత్వం 250 గజాల ఇంటి స్థలం, నిర్మాణానికి రూ.5 లక్షలు, ఉచిత వైద్యం, పింఛన్, ఉచిత బస్సు సౌకర్యం, గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులు అయినా ఉద్యమకారుల ఊసు ఎత్తకపోవడం విడ్డూరమన్నారు. ఉద్యమ కారులకే కాదు.. ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేసే వరకు ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.