calender_icon.png 2 February, 2026 | 6:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెట్రోపై డీపీఆర్ ఇస్తేనే నిధులు!

02-02-2026 01:44:56 AM

  1. ముందు ఎల్‌అండ్‌టీతో విలీన చర్చలు పూర్తిచేసుకోండి
  2. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సూచన
  3. ఇది.. ఆర్థిక వ్యవస్థను స్థిరంగా తీసుకెళ్లే బడ్జెట్
  4. రక్షణ, రైల్వే, ఫార్మా, అగ్రికల్చర్, మహిళా సంక్షేమానికి పెద్దపీట
  5. తెలంగాణకు మూడు హైస్పీడ్ రైళ్లు
  6.   33 జిల్లాలకు బాలికల హాస్టళ్లు మంజూరు
  7. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు పన్ను 2 శాతానికి తగ్గింపు అని వెల్లడి

హైదరాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి):  మెట్రోపై రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ ఇస్తే కేంద్రం ఆమోదం తెలిపి నిధులిస్తుందని  కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.  మెట్రో గురించి ప్రత్యేకంగా బడ్జెట్‌లో ఉందని, పట్టణాభివద్ధి శాఖ వద్ద.. మెట్రో నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వ వాటా ఇచ్చేందుకు తగినన్ని నిధులున్నాయని చెప్పారు.  ముందుగా హైదరాబాద్ మెట్రోపై  రాష్ట్ర ప్రభుత్వం ఓ స్పష్టతకు వచ్చి, ఎల్‌అండ్‌టీతో విలీనంపై ఏర్పాటు చేసిన కమిటీ చర్చలను పూర్తి చేసుకోవాలని సూచించారు.

ఇవన్నీ లావాదేవీలను పూర్తిచేసుకుని వచ్చిన తర్వాత, సరైన డీపీఆర్ సమర్పిస్తే.. దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలపై నిర్ణయం తీసుకుంటుందని మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్‌పై కిషన్ రెడ్డి ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. 

దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా,   ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేలా, దేశంలో మౌలికవసతులకు పెద్దపీట వేస్తూ.. రక్షణ రం గా న్ని మరింత శక్తివం తం చేసుకుంటూ.. రైల్వే, ఫార్మా, అగ్రికల్చర్, మహిళా సంక్షేమం వంటి అంశాలకు కేం ద్ర బడ్జెట్‌లో పెద్దపీట వేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.   

బడ్జెట్‌లో పలు సంస్కరణలు

నరేంద్ర మోదీ ప్రభుత్వం.. ప్రతి వారం జరిగే కేబినెట్ సమావేశాల్లో ఏదైనా ఒక సంస్కరణ తీసుకొస్తుందని,  బడ్జెట్‌లోనూ.. విదేశీ పెట్టుబడులు, ఐటీ, క్రిటికల్ మినరల్ సెక్టార్లో, టాక్స్ విషయంలోనూ చాలా సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. రూ.2, 3 లక్షలనున్న వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపును రూ.12.50 లక్షలకు పెంచారని, సామాన్యులు వాడే వస్తువులపై టాక్స్ తగ్గించారన్నారు. ఇది రిఫామ్స్ ఎక్స్ ప్రెస్ బడ్జెట్ అని, తాత్కాలికంగా లబ్ధి చేకూర్చడం కంటే.. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బడ్జెట్ అని చెప్పారు.  

తెలంగాణకు అనేక రకాల మేలు

తెలంగాణ రాష్ట్రానికి ఈ బడ్జెట్ అనేక రకాలుగా మేలుచేస్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పన్నుల వాటాగా.. గతేడాదితో పోలిస్తే.. 13.5 శాతం వృద్ధిరేటుతో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి 2025- ఆర్థిక సంవత్సరంలో.. పన్నుల వాటాగా రూ.29,280 కోట్లు రాగా.. అది 2026 సంవత్సరానికి 13.5 శాతం పెరుగుదలతో.. రూ.33,180 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. దేశంలో 7 హైస్పీడ్ రైల్ కారిడార్స్ ప్రకటిస్తే.. అందులో మూడు (హైదరాబాద్‌ొో-పుణే, హైదరాబాద్- హైదరాబాద్ హైదరాబాద్ నగరం నుంచే ప్రారంభం అవుతున్నాయని తెలిపారు.

రింగ్ రోడ్డు, ఐటీ, బయోఫార్మా, రియల్ ఎస్టేట్ రంగాల అభివృద్ధిలో దూసుకుపోతున్న హైదరాబాద్ నగరానికి.. మూడు హై స్పీడ్స్ రావడం మరింత లాభం చేయనుందన్నారు. ఎరువుల సబ్సిడీకి నిధులు గతంతో పోలిస్తే సుమారు రూ.7 వేల కోట్లు అదనంగా కేటాయించిందని, మొత్తం రూ.1.26 వేల కోట్లు ఎరువుల సబ్సిడీకి కేటాయించిందని, సింహ భాగం తెలంగాణకే అని తెలిపారు.

ఎస్‌టీఈఎమ్   కోర్సుల్లో ఉన్నత విద్య చదువుతున్న.. యువతులకు.. ల్యాబ్, క్లాసెస్ కారణంగా.. ఇళ్లకు దూరంగా ఉండి చదివే వారికి ఇబ్బంది అవుతోందని, ప్రతి జిల్లాకు ఒక గర్ల్స్ హాస్టల్ నిర్మించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానన్నారు. 

2047 వరకు టాక్స్ హాలిడే...

డేటా సెంటర్లలో అవసరమైన క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌కు మద్దతివ్వడం, ఇందులో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కేంద్రం నడుం బిగించిందని, ఏ విదేశీ కంపెనీ అయినా.. భారతీయ డేటా సెంటర్ల సర్వీసెస్ వాడితే.. ఆ కంపె నీకి.. 2047 వరకు టాక్స్ హాలిడేను ప్రకటించారన్నారు. దీని వల్ల భారతదేశంలోని డేటాసెం టర్ల ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణం సాధ్యమవుతుందన్నారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ కోసం.. ఈబడ్జెట్‌లో ఎంఆర్‌టీఎస్, మెట్రో ప్రాజెక్టులకు.. రూ.28,740 కోట్లు కేటాయించారని చెప్పారు.

టీవీ సీరియల్‌గా ఫోన్ ట్యాపింగ్ కేసు 

ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పటికే రెండేళ్లకు పైగా ఆలస్యమైందని, సీరియల్ లాగా సాగదీస్తున్నారని తెలిపారు. కేసీఆర్ కు మార్తె కవిత... తన భర్త ఫోన్ ట్యాప్ అయిందని ఆరోపణ చేసిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో.. బీజేపీ మంచి ఫలితాలు సాధిస్తుందని తెలిపారు.