11 April, 2026 | 3:48 PM

Breaking News

బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే   •   ఐలాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. కూల్చివేతలపై రంగనాథ్ క్లారిటీ!   •   తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   ఇప్పుడు ఎన్నికలు జరిగినా... కాంగ్రెస్‌కు 100 సీట్లు ఖాయం   •   కలెక్టర్ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు   •   జ్యోతిరావు పూలే జయంతి ఆశయ సాధన కోసం కృషి చేయాలి   •   20న జగిత్యాలలో కేసీఆర్ సభ... జీవన్ రెడ్డి చేరిక — బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం   •   లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ   •   సారంపల్లిలో శిరీష వివాహానికి కరీంనగర్ డెయిరీ పుస్తెమట్టెలు అందజేత   •   మొక్కజొన్న పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని విక్రయించాలి   •  

ఫంకీ నవ్విస్తుంది

08-02-2026 12:48 AM

హీరో విశ్వక్ సేన్, దర్శకుడు కేవీ అనుదీప్ కలయికలో వస్తున్న చిత్రం ‘ఫంకీ’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కయాదు లోహర్ కథానాయిక. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13న థియేటర్లలో అడుగు పెట్టనున్న ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో చిత్ర కథానాయకుడు విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. “ఫంకీ సినిమా రెండు గంటల పది నిమిషాల పాటు నవ్విస్తూనే ఉంటుంది. ఫోన్ పెట్టుకోవాలనే ఆలోచనే రాదు.

స్నేహితులు, కుటుంబ సభ్యులతో థియేటర్‌కు రండి. కడుపుబ్బా నవ్వుకుంటారు” అన్నారు. కథానాయిక కయాదు లోహర్ మాట్లాడుతూ.. “ట్రైలర్ ఎంత కామెడీగా ఉందో, సినిమా వంద రెట్లు ఉంటుంది. అనుదీప్ ట్రేడ్ మార్క్ కామెడీ చూస్తారు” అని చెప్పారు. ‘ఫంకీ సినిమా అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంద’ని దర్శకుడు అనుదీప్ తెలిపారు. నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. “ట్రైలర్‌లో పంచ్‌లు బాగా పేలాయి కదా. సినిమా అంతా ఇలాగే ఉంటుంది. ప్రతి సన్నివేశం నవ్విస్తుంది. కామెడీ కోసం థియేటర్‌కు రండి. అనుదీప్ మిమ్మల్ని అసలు నిరాశపరిచాడు. ‘జాతిరత్నాలు’తో ఎలా ఆకట్టుకున్నాడో ‘ఫంకీ’తో కూడా అదేస్థాయిలో ఆకట్టుకుంటాడు” అన్నారు.