23 June, 2026 | 7:31 PM

Breaking News

మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •   విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •   ప్రజారోగ్యాన్ని... నాశనం చేస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే మూయించండి   •   వెంకటాపురం గ్రామంలో విద్యా సామగ్రి పంపిణీ   •   చికిత్స కోసం రూ.1.50 లక్షల ఎల్ఓసి అందజేత   •   పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ చైర్మన్‌గా మిద్దెల సత్యనారాయణ   •   విద్యార్థులకు స్ఫూర్తి… నోటుబుక్స్ పంపిణీతో ఆనందం   •  

‘క్రిష్4’తో బాలీవుడ్ రీఎంట్రీ!

07-02-2026 12:00 AM

ప్రపంచ సినీ ప్రియుల గుండెల్లో గ్లోబల్ స్టార్‌గా స్థానం సంపాదించుకున్న ప్రియాంక చోప్రా మళ్లీ ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌పై దండయా త్ర చేయనుందా..? అంటే, ఔననే సమాధానమే వస్తోం ది! ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ నుంచి భారీ ప్రాజెక్టులతో వార్తల్లో నిలుస్తోందీ బ్యూటీ. రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో రూపొందుతున్న ‘వారణాసి’ చిత్రంతో ప్రియాంక తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టనుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాత్రల లుక్ పోస్టర్లు ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి.

అయితే, తాజాగా ప్రియాంక చోప్రాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ సూపర్ హీరో ఫ్రాంచైజీ ‘క్రిష్- 4’లో ప్రియాంక లీడ్ రోల్‌లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మళ్లీ ప్రియాంకనే హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు సమాచారం. హృతిక్  జోడీతో గతంలో వచ్చిన ‘క్రిష్’ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ అదే మ్యాజిక్‌ను మరోసారి పునరావృతం చేయాలనే ఆలోచనతో తాజా నిర్ణయం తీసుకున్నట్టు టాక్. ఇదే నిజమైతే, ఈ సినిమా తో చాలా ఏళ్ల విరామం తర్వాత ప్రియాం బాలీవుడ్‌లో గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చినట్టే!