13 July, 2026 | 9:42 PM

Breaking News

నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •  

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసనితో ఎంజాయ్ పక్కా

08-02-2026 12:49 AM

శివాజీ నిర్మాతగా మారి తన సొంత బ్యానర్ శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై రెండోచిత్రంగా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అనే చి త్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లయ శివాజీకి జంటగా నటించారు. రోహన్, ప్రిన్స్, అలీ, ధన్‌రాజ్, ఇమ్మాన్యూయేల్ ఇత ర పాత్రల్లో నటిస్తున్నారు. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 12న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించారు.

ఈ కార్యక్రమా నికి స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. “సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ట్రైలర్ చూస్తుంటేనే సినిమా చూడాలని క్యూరియాసిటీ పెరిగింది. ఈ సినిమా చూసి ప్రేక్షకులందరూ ఎంజాయ్ చేయడం పక్కా” అని చెప్పారు. ప్రొడ్యూసర్, యాక్టర్ శివాజీ మాట్లాడుతూ.. “ఈ సినిమా కోసం నేను నిర్మాత కాదు, టీచర్‌లా వ్యవహరించా. టీమ్ వర్క్ చేసి మంచి సినిమా చేశాం. బండ్ల గణేశ్ ఈ సినిమా కోసం సాంగ్ చేశారు. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది” అని తెలిపారు.

లయ మాట్లాడుతూ.. “సినిమా చాలా బాగా వచ్చింది. ఇప్పటివరకు రత్నమాలగా గుర్తుపెట్టుకున్నారు. ఇప్పుడు ఉత్తరగా గుర్తు పెట్టుకుంటారని నమ్ముతున్నా” అని చెప్పారు. అలీ మాట్లాడుతూ.. “కళామతల్లి అందరినీ స్వాగతిస్తుంది. టాలెంట్ ఉన్నవాళ్లే ఎదుగుతారు. సినిమా తీసే స్టేజీకి వచ్చిన శివాజీ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. శివాజీ, సుధీర్ హిట్ కొట్టబోతున్నారు” అన్నారు. డైరెక్టర్ సుధీర్ మాట్లాడుతూ.. “కష్టపడితే లైఫ్ ఉంటుందని చెప్పడానికి నాకు చిరంజీవి ఇన్‌స్పిరేషన్. కష్టపడితే బాస్‌నే డైరెక్ట్ చేయొచ్చనేది అనిల్ రావిపూడి ఇన్‌స్పిరేషన్. బిగ్ స్టార్స్ అందరితో కలిసి పనిచేయడం నిజంగా నా అదృష్టం” అని చెప్పారు. ఈటీవీ విన్ సాయికృష్ణ, రైటర్ మిథిల్, ఎడిటర్ బాలు, ధనరాజ్ తదితర చిత్రబృందం కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు.