09-12-2025 01:57:50 AM
అల్లాదుర్గం సిఐ రేణుక రెడ్డి
రేగోడు, డిసెంబర్ 8: ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించాలని అల్లాదుర్గం సిఐ రేణుక రెడ్డి అన్నారు. సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న సందర్భం గా సోమవారం మండలంలోని మర్పల్లి, రేగోడు, కొత్తవన్ పల్లి గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పట్టించి ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ పోచయ్య, సిబ్బంది ఉన్నారు.