25 August, 2026 | 3:47 PM

Breaking News

మండలంలో వనమహోత్సవం కార్యక్రమం.   •   ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరిశీలించిన ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్   •   వన మహోత్సవం వేళ చెట్ల నరికివేత   •   అవుట్‌డోర్ ఎలక్ట్రికల్ ఉద్యోగులకు కన్వీనియన్స్ వెహికల్ ఏర్పాటు చేయాలి   •   పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి   •   ఆల్ ఇండియా బీడీ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షుడి గా గోవర్ధన్   •   ప్రకృతిని మనం నాశనం చేస్తే.... ప్రకృతి మనల్ని నాశనం చేస్తుంది   •   ప్రకృతిని మనం నాశనం చేస్తేప్రకృతి మనల్ని నాశనం చేస్తుంది   •   సీతారాంపల్లి లో మొక్కలు నాటిన గ్రామ నాయకులు   •   నషాముక్త్‌ భారత్‌ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలి   •  

‘గద్దర్ యాది’లో వాల్‌పోస్టర్ ఆవిష్కరణ

02-08-2024 01:53 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 1 (విజయక్రాంతి): ప్రజా యుద్ధనౌక గద్దర్ మొదటి వర్ధంతిని పురస్కరించుకుని గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 6న రవీంద్రభారతిలో ‘గద్దర్ యాదిలో’ పేరుతో సభను నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ గుమ్మడి సూర్యకిరణ్ తెలిపారు. ఈ మేరకు గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సభ వాల్‌పోస్టర్‌ను ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, మాజీ ఎమ్మెల్యే క్రాంతికుమార్, ప్రజాకవి ఏపూరి సోమన్న, ఏంవీ ఫౌండేషన్ వెంకట్‌రెడ్డితో కలిసి సూర్యకిరణ్ ఆవిష్కరించారు.