25 August, 2026 | 3:40 PM

Breaking News

వన మహోత్సవం వేళ చెట్ల నరికివేత   •   అవుట్‌డోర్ ఎలక్ట్రికల్ ఉద్యోగులకు కన్వీనియన్స్ వెహికల్ ఏర్పాటు చేయాలి   •   పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి   •   ఆల్ ఇండియా బీడీ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షుడి గా గోవర్ధన్   •   ప్రకృతిని మనం నాశనం చేస్తే.... ప్రకృతి మనల్ని నాశనం చేస్తుంది   •   ప్రకృతిని మనం నాశనం చేస్తేప్రకృతి మనల్ని నాశనం చేస్తుంది   •   సీతారాంపల్లి లో మొక్కలు నాటిన గ్రామ నాయకులు   •   నషాముక్త్‌ భారత్‌ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలి   •   పంటల మార్పిడితోనే వ్యవసాయం లాభసాటి   •   వన మహోత్సవంలో నాటిన ప్రతి మొక్కను రక్షించాలి   •  

ప్రకృతిని మనం నాశనం చేస్తేప్రకృతి మనల్ని నాశనం చేస్తుంది

25-08-2026 03:00 PM

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

మొక్కల సంరక్షణతోనే వనమహోత్సవానికి సార్థకత

బాన్సువాడ, ఆగస్టు 25 (విజయ క్రాంతి): ప్రకృతి సంపదను మనం నాశనం చేస్తే ప్రకృతి తిరిగి మనల్ని నాశనం చేస్తుందని అందుకే ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. వన మహోత్సవంలో భాగంగా బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, పట్టణంలోని ఫిల్టర్ బెడ్ ప్రాంతంలో ఎక్సైజ్ శాఖ, గౌడ సంఘం ఆధ్వర్యంలో గీత కార్మికుల ఆధ్వర్యంలో, అనంతరం బాన్సువాడ మండలం బోర్లం క్యాంపులోని గురుకుల బాలికల పాఠశాల ఆవరణలో మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు,ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజ్ లు పాల్గొని మొక్కలను నాటారు.

ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ అడవులు, చెట్లను విచ్చలవిడిగా నరికివేయడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందన్నారు. చెట్ల సంఖ్య తగ్గడంతో భూగర్భ జలాలు అడుగంటడంతో పాటు వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. వనమహోత్సవం లక్ష్యం మొక్కలు నాటడంతో పూర్తికాదని, వాటిని క్రమం తప్పకుండా సంరక్షించి పెద్దవిగా పెంచినప్పుడే కార్యక్రమానికి సార్థకత చేకూరుతుందని అన్నారు. విద్యార్థులు మొక్కల ప్రాధాన్యతను తెలుసుకుని తమ ఇళ్లలో, పాఠశాలలు, హాస్టళ్లలో మొక్కలు నాటేలా ముందుకు రావాలని కోరారు.

పచ్చదనం పెంపొందించేందుకు ప్రజలందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాసుల విజయ బాలరాజ్,ఆర్డీవో రవీందర్ రెడ్డి,ఎఫ్డివో సునీతా, ఎఫ్ఆర్వో హబీబ్, డిఎల్పివో ప్రసాద్,ఎంపీడీఓ ఆనంద్, ఎంఆర్వో రాజా నరేందర్ గౌడ్, జిల్లా నోడల్ అధికారి సలాం, ప్రిన్సిపాల్ శారదా,ప్రజా ప్రతినిధులు మోహన్ నాయక్, ఏజాజ్,గురు వినయ్ కుమార్ ,నార్ల సురేష్,నార్ల రవీందర్, గోపాల్ రెడ్డి,బాబా, ఖాలేక్ కౌన్సిలర్లు ,కోఆప్షన్ సభ్యులతో పాటు విద్యార్థినులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.