ఘనంగా గడి మైసమ్మ బోనాలు
24-08-2026 02:07 AM
మేడ్చల్, ఆగస్టు 23 (విజయ క్రాంతి): మేడ్చల్ పట్టణంలో గడి మైసమ్మ బోనాలు ఘనంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజలు చేశారు. ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమములో భాస్కర్ యాదవ్, రాజ మల్లారెడ్డి, నవీన్ రెడ్డి, భాగ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.






