24 August, 2026 | 2:40 AM

పూజిత, ప్రేమ్ దంపతులను ఆశీర్వదించిన పూలపల్లి కృష్ణారెడ్డి

24-08-2026 02:08 AM

రాజేంద్రనగర్, ఆగస్టు 23 (విజయక్రాంతి): రాజేంద్ర నగర్ నియోజకవర్గం గండిపేట మండలానికి చెందిన నైనార్ మోహన్ కుమార్తె పూజిత, ప్రేమ్ వివాహ వేడుకకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పూలపల్లి కృష్ణారెడ్డి, ఏ బ్లాక్ అధ్యక్షుడు డప్పు నవీన్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో హైదర్షాకోట్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్. శంకర్, మాజీ ఉపసర్పంచ్ తనయుడు లక్ష్మణ్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కట్ట విష్ణు తదితరులు పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.