calender_icon.png 23 August, 2025 | 10:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చట్టంగా గేమింగ్ బిల్లు

23-08-2025 12:33:23 AM

  1. ఆమోదం తెలిపిన రాష్ట్రపతి

ఉభయసభల్లో ఆమోదం పొందిన బిల్లు

న్యూఢిల్లీ, ఆగస్టు 22: ఉభయసభల్లో ఆమోదం పొందిన ‘ది ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్’కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమోదముద్ర వేశారు. లోక్‌సభ, రాజ్యసభ రెం డింటిలో కూడా ఈ బిల్లు మూజువాణి ఓటుతోనే ఆమోదం పొందింది. ఈ బిల్లు ప్రకారం అన్ని రకాల గ్యాంబ్లింగ్ గేమ్స్, ఆన్‌లైన్ ఫాంటసీ స్టోర్స్, ఆన్‌లైన్ లాటరీలు నిషేధం.

కేవలం ఆన్‌లైన్ గేమ్స్ నిర్వహించే వారు మాత్రమే కాకుండా వాటికి అడ్వర్టుజ్ చేసే వారికి కూడా భారీగా జరిమానాలు వి ధించనున్నారు. ఈ బిల్లు విషయంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. ఎగువ సభలో కేవలం 26 నిమిషాల్లోనే ఈ బిల్లు పాస్ అయింది. ఆన్‌లైన్ గేమ్స్ ఆడేవారితో పాటు ప్రమోషన్లు చేసే వారిపై కూడా ఉక్కుపాదం మోపనున్నారు.