23-08-2025 12:31:51 AM
నిండా మునిగిన ముంబై వ్యాపారవేత్త
ముంబై, ఆగస్టు 22: ముంబైకి చెందిన వ్యాపారవేత్త ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడి పెట్టి రూ. 12 కోట్లకు పైగా నష్టపోయాడు. దీంతో అతడు ఒక్కసారిగా అప్పు ల్లో కూరుకుపోయాడు. దశాబ్దాలుగా వ్యా పారం చేస్తున్న ఆ వ్యక్తి ఆన్‌లైన్ బెట్టింగ్ యా ప్స్ దెబ్బకు దివాలా తీశాడు. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్ గేమింగ్ యాప్స్ ఉచ్చులో పడి నష్టపోతూ వచ్చాడు.
2021 లో ఫేస్‌బుక్‌లో ఒక ప్రముఖ నటి ప్రదర్శించిన ప్రకటనను చూసి ఆకర్షితుడినయ్యానని అతడు మీడియాకు వివరించాడు. నమ్మి పెట్టుబడులు పెట్టగా.. రూ. 12 కోట్లకు పైగా మోసపోయానని వాపోయాడు. మొదట్లో లాభాలు వచ్చాయని, తర్వాత యాప్ వ్యక్తు లు ఫోన్ చేసి భారీ లాభాల ఆశచూపి పెట్టుబడి పెట్టించుకున్నారని పేర్కొన్నాడు.