calender_icon.png 23 August, 2025 | 6:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

23-08-2025 12:34:48 AM

అత్యాచారం ఆరోపణలు చేసిన ట్రాన్స్‌జెండర్ మహిళ

కొచ్చి, ఆగస్టు 22: కేరళ కాంగ్రెస్ యువజన విభాగం మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే రాహుల్ మామ్‌కుటత్తిల్ చుట్టూ లైంగిక ఆ రోపణల ఉచ్చు బిగుస్తోంది. కేరళకు చెందిన ఓ నటి ఆరోపణలతో కాంగ్రెస్ యువజన అధ్యక్షుడిగా రాజీనామా చేసిన రాహుల్‌పై తాజాగా ట్రాన్స్‌జెండర్ మహిళ అవంతిక తీవ్ర ఆరోపణలు చేసింది. ‘నన్ను అత్యాచా రం చేయాలనుకుంటున్నట్టు చెప్పాడు. బెం గళూరు లేదా హైదరాబాద్‌కు వెళ్లి చేయొచ్చ ని పేర్కొన్నాడు’ అని ఆరోపించింది.

ఎన్నికల చర్చ సందర్భంగా మొదటిసారి కలుసుకున్న ట్లు అవంతిక తెలిపింది. ‘ఆ తర్వాత నెమ్మ దిగా స్నేహం మొదలైంది. సామాజిక మాధ్యమాల్లో మెస్సేజులతో భయానక అనుభవం ఏర్పడింది’ అని ఆరోపణలు గుప్పించింది. ఇప్పటికే నటి రిని ఆరోపణలు ప్రకంపనలు రేకెత్తిస్తున్న తరుణంలో ట్రాన్స్‌జెండర్ మహి ళ కూడా సదరు ఎమ్మెల్యేపై లైంగిక ఆరోపణలు చేయడం దుమారం రేపుతోంది.