ఘనంగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడలు
చండూరు/మర్రిగూడ (విజయక్రాంతి): మర్రిగూడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(School Games Federation) క్రీడలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మర్రిగూడ తహసిల్దార్ జక్కర్తి శ్రీనివాసులు, మాజీ జెడ్పిటిసి పాశం సురేందర్ రెడ్డి హాజరై స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులకు క్రీడల వల్ల శరీర దారుఢ్యత పెరుగుతున్నదని, విద్యతో పాటు క్రీడలలో రాణించాలని ఆయన అన్నారు. అనంతరం పాశం సురేందర్ రెడ్డి తన సొంత ఖర్చుతో ఈ క్రీడలకు పూర్తి సామాగ్రిని అదేవిధంగా 210 మంది విద్యార్థులకు బహుమతులు ప్రధాన చేశారు. క్రీడలకు సహకరించినపాశం సురేందర్ రెడ్డికి ఉపాధ్యాయులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సిలువేరు విష్ణు, పందుల పాండు, బిచ్చు నాయక్, మాజీ మోడల్ స్కూల్ చైర్మన్ కృష్ణ, జావేద్, మాధగోని లింగయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఫిజికల్ డైరెక్టర్ వేదావతి, ఉపాధ్యాయులు మాస బాలరాజు, జంగయ్య,, కృష్ణారెడ్డి, వాసుదేవారావు, అన్ని పాఠశాల పీడీలు తదితరులు పాల్గొన్నారు.






