10 August, 2026 | 1:37 PM

స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలి

02-09-2025 06:42 PM

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా 

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన పెండింగ్ ఫీజురీయంబర్స్ మెంట్స్, స్కాలర్ షిప్స్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణ కేంద్రంలోని వేలాది మంది విద్యార్థులతో ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా  ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్ ఖమ్మంపాటీ శంకర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పేద విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004 లో ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని నాటి ప్రభుత్వం తీసుకుని వచ్చిందన్నారు. ప్రభుత్వమే సామాజికంగా, ఆర్థికంగా వెనుక బడిన వర్గాల విద్యార్థులకు డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సులు, యూనివర్సిటీ విద్య చదువుతున్న విద్యార్యులకు ఈ ఫీజును చెల్లిస్తుందని, తెలంగాణ రాష్ట్రంగా విభజన చెందినా తర్వాత ఏర్పడిన బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని మార్చాలని చూసిందని విమర్శించారు. 2014 నుండి 2018 వరకు ఫీజులు చెల్లించిన బి ఆర్ ఎస్ ప్రభుత్వం 2019- 20 విద్యాసంవత్సరం కొంత బకాయిలను ఉంచిందని, అప్పటి నుండి రాష్ట్రంలో 2024 వరకు సుమారు 5358 కోట్ల స్కాలర్ షిప్స్ మరియు ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు ఇతర స్కీం లకు వాడుకుందని ఆరోపించారు.

విద్యార్థులకు ఒక్క పైసా చెల్లించకుండా వారి చదువుల నుండి మధ్యలోనే డ్రాప్ అయ్యే చర్యలకు పూనుకుందని,  బిఆర్ఎస్ పాలనలో ఫీజు బకాయిలు ఇవ్వలేదని,  కాంగ్రెస్  అధికారంలోకి వస్తే ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని, మరింత అభివృద్ధి చేసి అందరికి బకాయిలు లేకుండా ఇస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టో లో హామీని ఇచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఫీజుల బకాయిలు చెల్లించలేదన్నారు.తక్షణమే ఫీజులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఎమ్మెల్యేలను మంత్రులను అడ్డుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ‌రాష్ట్ర కమిటీ సభ్యులు  కుర్ర సైదా నాయక్, రాష్ట్ర గల్స్ కో కన్కన్వీనర్ కుంచంకావ్య, బుడిగా వెంకటేశ్ ,కోరే రమేష్, ముస్కురవీందర్, మారుపాక కిరణ్, స్పందన, జగన్ నాయక్ ,జగదీష్ ఇద్దిరాములు ,వీరన్న నాయక్ నవదీప్ ,రాకేష్, నవదీప్ , రమేష్ ,న్యూమాన్ , హరికృష్ణ ప్రణీత్,  కళ్యాణి, తులసి,  కార్తీక్,తదితరులు పాల్గొన్నారు.