12-11-2025 06:38:50 PM
హైదరాబాద్: గాంధీ జ్ఞాన్ ప్రతిష్టన్ స్వర్ణోత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోనే ఎత్తైన గాంధీజీ విగ్రహం ఏర్పాటుకు సంఘీభావంగా ఒక అడుగు లక్ష గాంధీజీ విగ్రహాల సేకరణ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్ లో గాంధీజీ విగ్రహాల సేకరణ కార్యక్రమ ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు కల్వ సుజాత, దీపక్ జాన్, గాంధీ విజ్ఞాన కేంద్రాల కమిటీ రాష్ట్ర కన్వీనర్ గాంధారి ప్రభాకర్, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ట వైస్ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఆర్గనైజర్ అండ్ అడ్వైజర్ కె.రాజునాగేశ్వరావు, వైస్ ప్రెసిడెంట్ నీరుడు దయాకర్ రెడ్డి పాల్గొన్నారు.