17-02-2026 04:47:46 PM
10 సంవత్సరాలు గడిచిన మా రాతలు.. మారవా
కంకర తేలిన రాళ్లపై కనీసం నడవలేని పరిస్థితి
జిల్లా కలెక్టర్ జిల్లా మంత్రులు స్థానిక ఎమ్మెల్యే స్పందించాలని ప్రజలు విద్యార్థుల వేడుకోలు
తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని పస్తాల గ్రామానికి వెళ్లే రోడ్డు బాగుచేయమని విద్యార్థులు, ప్రజలు రోడ్డు మీద ధర్నా చేశారు. గడచిన పది సంవత్సరాలుగా రోడ్డు పరిస్థితి బాగాలేక గ్రామస్థులు, వాహన దారులు, విద్యార్ధులు నానవస్థలు పడుతున్నారు. అయినా కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో విద్యార్ధులు మంగళవారం రోడ్డుపై ధర్నా చేశారు. రోడ్డుపై కంకర తేలి, లోతైన గుంతలు పడ్డాయి, గతంలో నేతలు ఇచ్చిన హామీలు, చేసిన శంకుస్థాపనలు కూడా శిధిలావస్థకు చేరాయని విమర్శించారు. మాకు పదిరోజుల్లో సమాధానం రాకపోతే కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ధర్నా చేస్తామని విద్యార్ధులు హెచ్చరించారు.
మా గ్రామానికి ప్రధాన సమస్య అయిన ఈ రోడ్డును త్వరగా పూర్తిచేసి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి, స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు అలాగే కలెక్టర్ అభ్యర్ధిస్తున్నట్లు ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. ఇది ఏమైనా కనీసం విద్యార్థులు వచ్చిన చైతన్యం గ్రామంలోని ప్రజలు యువత ముందుకు రాకపోవడం దురదృష్టకరమైన విషయం. తక్షణమే గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులను పరిశీలించి, గ్రామ వార్డు సభ్యులతో మమేకమై మాట్లాడి తక్షణమే నిధులు మంజూరు చేసి కనీసం ఎర్ర మట్టి పోసైన, తేలిన కంకరపై మరమ్మత్తులు చేయాలని విద్యార్థులు వేడుకుంటున్నారు.