calender_icon.png 12 November, 2025 | 8:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకులాల బకాయిలపై డిప్యూటీ సీఎం సమీక్ష

12-11-2025 07:08:18 PM

హైదరాబాద్: ఎస్సీ, మైనారిటీ గురుకులాల బకాయిలపై  ఆర్థిక శాఖ అధికారులు, గురుకులాల అధికారులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్సీ, మైనారిటీ హాస్టళ్ల డైట్, అద్దె బకాయిలు, మధ్యాహ్నం భోజనానికి సంబంధించిన బకాయిలకు రూ.163 కోట్లు వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్వహకులు నాణ్యతలో ఎక్కడ రాజీ పడొద్దని, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ పూర్తిస్థాయిలో పాటించాలని భట్టి సూచించారు. విద్యార్థిని, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను సమీక్షించేందుకు అధికారులు నిర్దేశిత క్యాలెండర్ ప్రకారం హాస్టళ్లను సందర్శించాలని డిప్యూటీ సీఎం భట్టీ పేర్కొన్నారు.