1 August, 2026 | 2:40 AM

థ్రిల్లింగ్ అంశాలతో నిరమ్

01-08-2026 01:54 AM

ముగెన్ రావ్, ప్రీతి అస్రాని, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘నిరమ్’. ఈ చిత్రాన్ని కే స్కేర్ సినిమాస్ సమర్పణలో యూనిట్ ఆఫ్ కే స్కేర్ వెంచర్స్ బ్యానర్‌పై కే బిందుమాధవి నిర్మిస్తున్నారు. దర్శకుడు బలరామ్ కృష్ణ ఈ సినిమాను సరికొత్త ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా రూపొందిస్తున్నారు.

ఈ సినిమా త్వరలో థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ శుక్రవారం ఈ సినిమా తెలుగు ట్రైలర్, ఆడియో లాంఛ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరో ముగెన్ రావ్ మాట్లాడుతూ.. “ఒక డిఫరెంట్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మా నిరమ్ మూవీ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది” అన్నారు.

హీరోయిన్ తాన్యా హోప్ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇంట్రెస్టింగ్‌గా వెళ్లే కథలో నేనూ ఒక భాగంగా కనిపిస్తా. అందరూ మా సినిమా చూసి ఎంజాయ్ చేయండి” అని తెలిపింది. డైరెక్టర్ బలరామ్ కృష్ణ మాట్లాడుతూ.. “నాకు దర్శకుడిగా తొలి చిత్రమిది. అనేక వెర్షన్స్ స్క్రిప్ట్ రాసి సరి చూసుకుని స్టోరీబోర్డ్‌తో ఈ సినిమా తెరకెక్కించాం. మా మూవీ నచ్చితే మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయండి” అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంకా నటీనటులు నితిన్ సత్యా, సురేఖా వాణి, కో ప్రొడ్యూసర్ పీ రాజేశ్, డీవోపీ సంటానియో టెర్జియో, మ్యూజిక్ డైరెక్టర్ డి. ఇమ్మాన్, సింగర్ ప్రవస్తి, లిరిసిస్ట్ భారతీబాబు కూడా మాట్లాడారు. చిత్రబృందం అందరూ పాల్గొన్నారు.