గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి

15-09-2026 | 09:50pm

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని నిర్మల్ మున్సిపల్(Nirmal Municipal) చైర్పర్సన్ అప్పల కావ్య చక్రవర్తి అన్నారు. మంగళవారం పట్టణంలోని బుధవార్ పేట్ గణేష్ మండపాలని సందర్శించి పూజలు నిర్వహించారు. 11 రోజులపాటు నిర్వహించే ఉత్సవాలను భక్తి వాతావరణాలు జరుపుకోవాలని పేర్కొన్నారు. ఉత్సవాల నిర్వాణకు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గణేష్ మండప సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు