16 May, 2026 | 7:11 PM

Breaking News

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ ఎమ్మెల్యే   •   వడూర్ ద్వారా బోత్ బస్సు సర్వీసు   •   పేదలు ఉచిత న్యాయ సేవలు పొందాలి   •   పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని దిష్టిబొమ్మ దగ్ధం చేసిన సీపీఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ   •   అనురాగ్ లో “హెటెరో ల్యాబ్స్ ఎస్ఎంటీ బ్రిడ్జ్ కోర్స్ 2026–27” ప్రోగ్రాం   •   గ్రామపంచాయతీ కార్మికుల జీతాలు పెంచాలి   •   అమరవీరులకు నివాళులు అర్పించిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రధాన కార్యదర్శి సంజీవరెడ్డి   •   తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి   •   కొనుగోలు చేసిన మక్కలని వెంటనే తరలించాలి   •   జాబ్ మేళాలో ఉద్యోగాల ఎంపిక   •  

మొబైల్ ఫోన్లు, బైకుల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు..

30-07-2025 05:38 PM

2 బైకులు, 9 మొబైల్ ఫోన్లు స్వాధీనం..

కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకొని మొబైల్ ఫోన్లను దొంగలిస్తున్న ముఠాను జీడిమెట్ల పోలీసులు(Jeedimetla Police) బుధవారం అరెస్టు చేశారు. ఈ నెల 27వ తేదీన సాయంత్రం 3 గంటల సమయంలో డి. అఖిల(21) అనే అమ్మాయి విధులు ముగించుకొని ఫోన్లో మాట్లాడుతూ హాస్టల్ కు వెళ్తుంది. షాపూర్ నగర్ లో శుభం హోటల్ సమీపంలోకి రాగానే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వెనుకనుండి అమ్మాయిని ఢీకొట్టి, బలవంతంగా నెట్టి, తన ఫోన్ ను లాక్కున్నారు. బైక్ తో ఢీకొట్టడంతో తన చెవికి గాయాలయ్యాయి. బాధితురాలు వెంటనే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి వాటి ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు.

నిందితులు A1) ఆర్. వైజయంత్ (19), A2) ఆర్.శివ(21), A3).ఆర్. నరేష్ (23), A4). కుమార్, A5).వెంకట్ గా పోలీసులు గుర్తించారు. నిందితులపై గతంలో పలు పోలీస్ స్టేషన్ లలో మొబైల్ ఫోన్ స్నాచింగ్, ఆటో మొబైల్ దొంగతనాల కేసులు నమోదయ్యాయని, శివ పై అత్యాచారం కేసు నమోదయ్యిందని పోలీసులు తెలిపారు. నిందితులు బహిరంగ ప్రదేశాలలో గంజాయి కొడుతూ, మందు తాగుతూ మత్తుకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్నామని ఒప్పుకున్నారు. నిందితుల వద్ద నుండి సుమారు 3.5 లక్షల విలువైన రెండు బైకులను, 9 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు.