30-07-2025 05:45:28 PM
హుజురాబాద్ (విజయక్రాంతి): తహఫుజ్ ఖత్మే నబువ్వత్ ఆధ్యాత్మిక వర్క్‌షాప్ పోస్టర్ను కరీంనగర్ జిల్లా(Karimnagar District) హుజరాబాద్ పట్టణంలోని జామియా మస్జీద్ లో బుధవారం ముఫ్తి మహ్మద్ ఘియాస్ మొహియుద్దీన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లిం యువతను ఇస్లాం వ్యతిరేక ప్రభావాల నుంచి రక్షించడం, ప్రబలుతున్న మతభ్రష్ట ఫిత్నాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఫిత్నా ఖాదియానీ, ఫిత్నా షకిలిత్, ఇంజనీర్ మహమ్మద్ అలీ మీర్జా వంటి పథకాలతో విశ్వాసాన్ని డగలబడుస్తున్న పరిస్థితుల్లో ఈమాన్‌ను పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
తెలంగాణ, ఏపీ నుంచి పలు రంగాలకు చెందిన ముస్లిం పండితులు వర్క్‌షాప్‌లో ప్రసంగించనున్నారు. జమ్మికుంట, హుజురాబాద్, వీనవంక, చిగురుమామిడి, సైదాపూర్, హుస్నాబాద్ వంటి ప్రాంతాల ముస్లిం ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు హాఫిజ్ అహ్మద్, కలీమ్ షరీఫ్, షాకిరుద్దీన్, సోహెల్ తదితరులు పాల్గొన్నారు.