20-05-2025 12:00:00 AM
నిర్మల్ మే 19 (విజయ క్రాంతి) : నిర్మల్ పట్టణ కేంద్రంగా పట్టణంలోని వివిధ కాలనీలకు గ్రామీణ ప్రాంతాలకు గంజాయిని సరఫరా చేస్తున్న మూట సభ్యులను సోమవారం పట్టుకుని అరెస్టు చేయడం జరిగిందని ఎస్పీ రాకేష్ మీనా తెలిపారు.
సోమవారం వివరాలను వెల్లడించారు. పట్టణం చెందిన కేఈ సాయి ప్రసాద్ పుట్ట శివకుమార్ షేక్ ముక్తార్ మౌలానా ఉప్పుల శంకర్ అనే నలుగురు సభ్యులు మహారాష్ట్రలోని కిన్వర్ట్ తాలూకా నుండి గంజాయి తీసుకొస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది అన్నారు.
జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు శనివారం రాత్రి బస్టాండ్ వద్ద తనిఖీలు నిర్వహించగా నూట సభ్యుల వద్ద ఉన్న ఒక కేజీ 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి మూడు సెల్ ఫోన్లు ఒక ఆటో ద్విచక్ర వానని సాధనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.
నిర్మల్ లో గంజాయి అక్రమ రవాలను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని గంజాయిని విక్రయించిన కొనుగోలు చేసిన చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ నరేష్ పోలీస్ సిబ్బంది వినయ్ అమీన్ తదితరులున్నారు