18 April, 2026 | 11:51 AM

సత్తుపల్లి జాతీయ రహదారిపై సాఫీగా ప్రయాణం

18-04-2026 10:01 AM

ఎమ్మెల్యే చొరవతో ప్రారంభమైన రోడ్డు పనులు

సత్తుపల్లి,(విజయక్రాంతి): సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నేషనల్ హైవేపై ప్రయాణికులకు నరకంగా మారిన అప్ అండ్ డౌన్ (ఎత్తుపల్లాలు) రోడ్డు సమస్యకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ ప్రమాదకరమైన రోడ్డుపై స్థానికులు, వాహనదారులు పడుతున్న ఇబ్బందులను గమనించిన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్. తక్షణమే స్పందించారు.

అధికారులతో ఎమ్మెల్యే చర్చలు: నేషనల్ హైవే ఇంచార్జ్ దివ్య తో ఎమ్మెల్యే  ప్రత్యేకంగా మాట్లాడి, సమస్య తీవ్రతను వివరించారు. ఎమ్మెల్యే విన్నపానికి సానుకూలంగా స్పందించిన అధికారులు వెంటనే మరమ్మతు పనులకు అనుమతులు మంజూరు చేసి, పనులను ప్రారంభించారు.

పనుల పరిశీలన: ఎమ్మెల్యే  ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న రోడ్డు పనులను శుక్రవారం కాంగ్రెస్ నాయకులు కమల్ పాషా  మున్సిపల్ కమిషనర్ నరసింహ  , మరియు మున్సిపల్ ఏఈ. కలిసి పరిశీలించారు. "ప్రజల భద్రతే మా ప్రాధాన్యత. నాణ్యతతో కూడిన పనులను వేగంగా పూర్తి చేసి ప్రయాణ ఇబ్బందులను తొలగించాలని అధికారులను ఎమ్మెల్యే కోరారు. ఈ సందర్భంగా పనులు వేగంగా చేపట్టినందుకు పట్టణ ప్రజలు మరియు వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.