18 April, 2026 | 11:24 AM

“నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన

18-04-2026 10:09 AM

జిల్లా కలెక్టర్ డా. సత్య శారద

వరంగల్, ఏప్రిల్ 18 (విజయ క్రాంతి): ప్రజాపాలన–ప్రగతి కార్యాచరణలో భాగంగా జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో పెట్రోల్ బంక్ యజమానులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని,ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేయడానికి “నో హెల్మెట్- నో పెట్రోల్” అనే విధానాన్ని కఠినంగా అమలు చేయాలని పెట్రోల్ బంక్ యజమాన్యాన్ని ఆదేశించారు.పెట్రోల్ బంకులకు వచ్చే వాహనదారులకు హెల్మెట్ అవసరంపై అవగాహన కల్పించాలని, నియమాలు పాటించే వారిని ప్రోత్సహించాలని తెలిపారు.రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని, ప్రజల్లో భద్రతపై చైతన్యం పెంచడంలో పెట్రోల్ బంక్ యజమానులు కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

శనివారం తో అరైవ్  అలైవ్ కార్యక్రమం చివరి రోజున పెట్రోల్ బంకు కి హెల్మెట్  ధరించి సీట్ బెల్ట్ ధరించి వచ్చే  వారికి గులాబీ  పువ్వును బహుకరించి  సురక్షితమైన ప్రయాణం చేయాలని సూచించాలని వాహనదారులకు అవేర్నెస్ కల్పించే ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ రెవెన్యూ జి సంధ్యారాణి, అదనపు కలెక్టర్ లోకల్ బాడీ వై వి గణేష్, జెడ్పి సీఈఓ రామ్ రెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కిష్టయ్య, పెట్రోల్ బంక్ యజమానులు పాల్గొన్నారు.