18 April, 2026 | 11:33 AM

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి

18-04-2026 10:07 AM

గుండాల,(విజయక్రాంతి): మండలంలోని రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నాయకుడు వాగబోయిన రమేష్ మరియు సామాజిక నేత షారోజ్ కలిసి పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లుకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గుండాల ప్రాంతంలో రైతులు పెద్ద ఎత్తున మొక్కజొన్న పండిస్తున్నప్పటికీ సరైన కొనుగోలు కేంద్రం లేక ఇబ్బందులు పడుతున్నారని, ఆరుగాలం కష్టపడిన రైతులకు నష్టాలు వాటిల్లుతున్నాయని తెలిపారు. స్థానికంగా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే రైతులకు సరైన ధర లభించడమే కాకుండా మధ్యవర్తుల దోపిడీ తగ్గుతుందని అన్నారు. అందువల్ల ప్రభుత్వం తక్షణమే స్పందించి గుండాలలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని వారు ఎమ్మెల్యేను కోరారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.