కృషి డిఫెన్స్ కాలనీ నూతన కమిటీ ఎన్నిక
08-12-2024 11:27 PM
పటాన్ చెరు (విజయక్రాంతి): పటాన్ చెరు పరిధిలోని కృషి డిఫెన్స్ కాలనీ నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కె.రామచంద్ర శర్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధ్యక్షుడుగా అమరేందర్, ప్రధాన కార్యదర్శిగా జనార్దన్, కోశాధికారిగా జోషికుమార్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీ అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, బీఆర్ఎస్ యువనేత పృథ్వీరాజ్, ప్యాక్స్ చైర్మన్ రాఘవేందర్ రెడ్డి, మాణిక్య రెడ్డి, శ్రీరాములు, నారాయణ, అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






