17 April, 2026 | 11:23 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

దొంగల ముఠా అరెస్టు

25-06-2025 12:17 AM

-రూ.4 లక్షల సొత్తు స్వాధీనం, పరారీలో ప్రధాన నిందితుడు 

-వివరాలు వెల్లడించిన ఎస్పీ శ్రీనివాసరావు

మెదక్, జూన్ 24(విజయక్రాంతి): మెదక్ పట్ణణంలో చోరీకి పాల్పడిన దొంగల ముఠాను పట్టుకొని రూ.4 లక్షల సొత్తు రికవరీ చేసినట్లు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలోని హౌజింగ్ బోర్డు కాలనీకి చెందిన కూర శేఖర్ ఇంట్లో ఈనెల 8వ తేదీన జరిగిన దొంగతనం కేసులో నిందితులైన హైదరాబాద్కు చెందిన గుడాల సతీష్, గుడ్డు రాజులను అరెస్టు చేసి వారి వద్ద కారు, ఆటో, 4.5 కిలోల వెండి వస్తువులు, 5 గ్రాముల బంగారం, మూడు కెమెరాలు, కీపాడ్ ఫోన్, ఐప్యాడ్, శాంసంగ్ ఐప్యాడ్, 326 డాలర్లు, అమెరికన్ సెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ప్రధాన నిందితుడు తిరుమల్ పరారీలో ఉన్నాడని, అతడికోసం గాలిస్తున్నట్లు తెలిపారు. దొంగతనం కేసులో రూ.8 లక్షల విలువలైన వస్తువులు చోరీకి గురికాగా ఇప్పటి వరకు రూ.4 లక్షల విలువైన వస్తువులు రికవరీ చేసినట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు దొరికితే మిగతా సొత్తును రికవరీ చేస్తామని చెప్పారు. కాగా నిందితులను రిమాండ్ చేసినట్లు తెలిపారు. ఈ కేసు ఛేదనలో డీఎస్పీతో పాటు  సీఐలు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, టౌన్ సీఐ మహేశ్, రూరల్ ఇంచార్జి సీఐ రాజారెడ్డి, పోలీసు సిబ్బందిపాల్గొన్నారు.