గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్
- ఓఆర్‌ఆర్‌పై ఏడుగురిని పట్టుకున్న పోలీసులు
- రూ.2 కోట్ల విలువైన 400 కేజీల గంజాయి సీజ్
పటాన్‌చెరు, మే 11: ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్ ఎస్‌ఓటీ, పటాన్‌చెరు పోలీసులు సోమవారం పట్టుకున్నారు. ఓఆర్‌ఆర్ ముత్తంగి వద్ద వ్యాను, కారులో తరలి స్తున్న 400 కిలోల గంజాయిని పట్టుకుని, ఏడుగురిని అరెస్టు చేశారు. పట్టుబడిన సరు కు, వాహనాల విలువ రూ.2 కోట్లు ఉంటుందని అంచనా. మహారాష్ట్ర సోలాపూర్‌కు చెం దిన మనీషా పడ్వాల్ గంజాయి కొనుగోలుదారు కాగా, ఒడిశాకు చెందిన ట్రిబ్యూన్ సర ఫరాదారు.
వీరిద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరి మధ్య ఒప్పందం కుదిర్చింది ప్రతాప్ హరిదాస్ పవార్. వ్యాన్ యజమాని ఆనంద్ మాయప్ప వాహనం ఇవ్వగా, బాలాజీ గణేష్ హోన్మణి కారుతో ఎస్కార్ట్‌గా వచ్చాడు. డ్రైవర్లు చందన్షిప్వే ఔదుంబర్, రంజీత్ రాజేందర్ గడగే, రోహిత్ హోవాల్, మైనర్ సాహిల్‌తో కలిసి ఈ నెల 8న ఒడిశా మల్కన్గిరి వెళ్లారు. అక్కడ 400 కేజీల గంజాయిని వ్యానులో లోడ్ చేసి, పైన కూరగా యల ఖాళీ ట్రేలు పేర్చి మహారాష్ట్రకు బయలుదేరారు.
పక్కా సమాచారంతో ముత్తంగి ఓఆర్‌ఆర్ వద్ద కాపుకాసిన ఎస్‌ఓటీ కూకట్‌పల్లి బృందం, పటాన్‌చెరు పోలీసులు వాహ నాలను తనిఖీ చేయగా పట్టుబడ్డారు. డీసీపీ పి.శోభన్ కుమార్, అడిషనల్ డీసీపీ ఎ.విశ్వప్రసాద్ పర్యవేక్షణలో ఎస్హెచ్వో జి.వినాయక్ రెడ్డి, డీఐ బి.రాజు, ఎస్‌ఓటీ ఇన్స్పెక్టర్ శివకుమార్ నేతృత్వంలోని బృందాలు ఈ ఆపరే షన్ చేపట్టాయి.






