23 April, 2026 | 2:03 AM

ప్రజా సమస్యలపై రాహుల్ గాంధీకి అవగాహన లేదు

18-12-2024 06:29 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బుధవారం సాయంత్రం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... మహరాష్ట్ర, హరియాణ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని, వరుసగా ఎన్నికల్లో ఓడిపోతున్న కాంగ్రెస్ పార్టీ నిరాశలో కూరుకుపోయిందని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి కావాలన్న రాహుల్ గాంధీ కోరిక నెరవేరటం లేదని కాంగ్రెస్ నేతలు నిరాశలో ఉన్నారని తెలిపారు. ఇన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్న రాహుల్ గాంధీకి ప్రజా సమస్యలపై అవగాహన లేదని, మిడిమిడి జ్జనంతో పార్టీని నడుపుతున్నారు.

రాహుల్ గాంధీ బెదిరింపులకు కేంద్రప్రభుత్వం భయపడదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ వైపు ఉన్నారు, కేసీఆర్ కాంగ్రెస్ వైపు ఉన్నారని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావొద్దని బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కవుతున్నాయని విమర్శంచారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, చేసినట్టే ఇప్పుడు రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని, దేశాన్ని నవ్వులపాలు చేస్తున్నారని మండిపడ్డారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేసినట్లే కాంగ్రెస్ కూడా చేస్తోంది. రేవంత్ సర్కార్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూ.80 వేల కోట్ల అప్పు చేసిందని కిషన్ రెడ్డి విరుచుకుపడ్డారు.