20 March, 2026 | 2:59 PM

అచ్చంపేటలో గంజాయి ముఠా అరెస్ట్

20-03-2026 12:00 AM

అచ్చంపేట మార్చి 19నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రంలో గంజాయి విక్రయాలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మార్కెట్ సమీపంలోని పాత భవనాల వద్ద గుట్టుచప్పుడు కాకుండా గంజాయి క్రయవిక్రయాలు జరుగుతున్నాయని వచ్చిన పక్కా సమాచారంతో బుధవారం మధ్యాహ్నం పోలీసులు రైడ్ నిర్వహించారు.ఈ సందర్భంగా గంజాయి కొనుగోలు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. సీఐ శంకర్ నాయక్ ఆదేశాల మేరకు పూర్తి విచారణ జరిపి కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచి ఐదుగురిని రిమాండ్కు తరలించినట్లు ఎస్త్స్ర హనుమంత్ రెడ్డి గురువారం మీడియాకు తెలిపారు.

అమ్రాబాద్కు చెందిన నోముల అభి గౌడ్ హైదరాబాద్లోని దూల్పేట్ ప్రాంతం నుంచి గంజాయి ప్యాకెట్లను తెచ్చి స్థానిక యువతకు విక్రయలు జరుతున్నట్లు గుర్తించారు. అతని వద్ద నుంచి కొనుగోలు చేసిన సయ్యద్, లక్ష్మాపూర్కు చెందిన కొర్ర విక్రమ్ (ఆటో డ్రైవర్), కొర్ర శ్రీకాంత్ (ఆటో డ్రైవర్), కొర్ర పవన్ ( రియల్ ఎస్టేట్ బ్రోకర్), చంద్రకంటి అనిల్ తదితరులు స్థానికంగా మరికొందరికి అధిక ధరలకు విక్రయిస్తూ ఈజీ మనీ సంపాదిస్తున్నట్లు విచారణలో బయటపడింది.

ఈ కేసులో మొత్తం ఆరుగురిపై కేసులు నమోదు చేయగా, ప్రధాన నిందితుడు (ఏ1) నోముల అభి గౌడ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.మత్తు పదార్థాల విక్రయం, కొనుగోలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఎస్త్స్ర హనుమంత్ రెడ్డి హెచ్చరించారు.