25-06-2025 06:28:11 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav)ను తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్(Telangana Gazetted Officers Association) నిర్మల్ జిల్లా కార్యవర్గం బుధవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసింది. సీసీఎల్ఏ ఇచ్చిన జీవో మేరకు అసోసియేషన్ భవనం నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించాలని వారు కలెక్టర్ ని కోరారు.
అసోసియేషన్ ప్రతినిధుల వినతి అంశంపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ కు TGOs అసోసియేషన్ జిల్లా కార్యవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు డా. పి. జి. రెడ్డి, జిల్లా కార్యదర్శి ధాత్రికా రమేష్, అసోసియేట్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్, జాయింట్ సెక్రటరీ సుధర్షన్, పబ్లిసిటీ సెక్రటరీ విష్ణువర్ధన్, ఆఫీస్ సెక్రటరీలు రాజమల్లు, క్రాంతి కుమార్, స్పోర్ట్స్ సెక్రటరీ వినోద్ కుమార్, ఈసీ సభ్యులు శ్రీహరి, జీవరత్నం తదితరులు పాల్గొన్నారు.