15 April, 2026 | 1:18 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

మార్వాడి దుకాణాలకు అనుమతులు ఇవ్వొద్దు

25-06-2025 06:09 PM

సంస్థాన్ నారాయణపూర్ (విజయక్రాంతి): సంస్థాన్ నారాయణపురం మండల(Samsthan Narayanpur Mandal) కేంద్రంలో మార్వాడీల దుకాణాలకు అనుమతులు ఇవ్వొద్దని వర్తక సంఘం ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు. మార్వాడి దుకాణాల ద్వారా స్థానికులు ఉపాధి కోల్పోయి కూలీలుగా మారే అవకాశం ఉందని, గతంలో మర్వాడి వ్యాపారస్తులు బంగారం షాపులు పెట్టి స్థానికుల వద్ద బంగారంతో పరారైన సంఘటనలు ఉన్నాయని తెలిపారు.

స్థానిక వర్తక వ్యాపారులను ప్రోత్సహించాలని మార్వాడి వ్యాపారస్తులు దుకాణాల సముదాయాన్ని ప్రారంభించుకోవడం విరమించుకోవాలని ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘం అధ్యక్షులు మురారిశెట్టి వెంకటయ్య, కార్యదర్శి వంగరి రఘు, కార్యవర్గ సభ్యులు మొగుదాల సత్తయ్య, పాలకూర్ల యాదగిరి, చిలువేరు నరసింహ, బొమ్మగోని రమేష్, తెలంగాణ బిక్షం, చిలువేరు అంజయ్య, డాక్టర్ వెంకటేష్, చిలువేరు శంకర్, తదితరులు పాల్గొన్నారు.