ట్రస్మా గౌరవ సలహాదారునిగా గీతాంజలి అప్పారావు
ఖమ్మం డివిజన్‌కు ఏకగీవ్రంగా ఎన్నిక
ఖమ్మం, ఫిబ్రవరి 24(విజయక్రాంతి): ఖమ్మం పట్టణం శ్రీనివాస నగర్‌లోని గీతాంజలి విద్యానికేతన్ పాఠశాల కరస్పాండెంట్ టీవీ అప్పారావు ఖమ్మం డివిజన్ ప్రైవేట్ పాఠశాలల సంఘం (ట్రస్మా)కు గౌరవ సలహాదా రుగా ఎన్నికయ్యారు. న్యూ విక్టరీ పాఠశాలలో జరిగిన సమావేశంలో టీవీ అప్పారావును గౌరవ సలహాదారుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఖమ్మం డివిజన్‌లో దాదాపు 100కు పైగా ప్రైవేట్ పాఠశాలలు నడుస్తున్నాయి. ఈ సందర్భంగా టీవీ అప్పారావు మాట్లాడుతూ ఖమ్మం డివిజన్ ప్రైవేట్ పాఠశాలల సంఘం అభివృద్ధికి తాను పూర్తిస్థాయిలో నిరంతర సేవలు అందిస్తానని తెలిపారు.
కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ప్రైవేట్ పాఠశాలల సంఘం అధ్యక్షుడు గుర్రం కాంతారావు, ట్రస్మా రాష్ట్ర నాయకులు ఐవీ రమణారావు, ఎండీ అజారుద్దీన్, శశిధర్ రెడ్డి, ఖమ్మం డివిజన్ ట్రస్మా అధ్యక్షులు ఎండీ జాఫర్ మతిన్, సెక్రటరీ సూరిబాబు, ట్రెజరర్ మోహన్ రెడ్డి ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. గౌరవ సలహాదారునిగా ఎన్నికైన టీవీ అప్పారావును పుర ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు ఈ సందర్భంగా అభినందించారు.




