నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు
- కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
కరీంనగర్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇంటర్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 25 నుంచి మార్చి 16 వర కు ఇంటర్మీడియట్ మొదటి, రెండవ పరీక్షలు జరుగనున్నాయి. పరీక్ష జరిగే రోజు ప్ర శ్నాపత్రాల సీల్ ఓపెన్ చేయడాన్ని హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ నుంచి ఉన్నతా ధికారులు పరిశీలిస్తారు. ఉదయం 8.15 నిమిషాల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తారు.
9 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా, 9.05 తర్వాత పరీక్షా కేంద్రానికి వచ్చిన వారిని పరీక్ష రాసేందుకు అనుమతించబోమని అధికారులు చెప్పారు. కాపీయింగ్ యు అవకాశం లేకుండా చర్య లు తీసుకున్నారు. ప్లైయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. అలా గే చీఫ్ సూపరింటెండెంట్లు, అదనపు విభాగ అధికారులు, ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అ మలు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థుల కోసం ప్రభుత్వం ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించింది.
క్యూఆర్ కోడ్‌తో పరీక్షా కేంద్రం గుర్తింపు
అభ్యర్థుల హాల్ టికెట్లపై ఉన్న క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసిన వెంటనే పరీక్షా కేంద్రం వివరాలు, చిరునామా, ఎలా వెళ్లవచ్చనే స మాచారం తెలుసుకోవచ్చు. విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించేందుకు డీఐఈవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. 087 8-2933006 నంబర్ కు ఫోన్ చేస్తే సమస్యలను, ఇబ్బందులను పరిష్కరిస్తారు. హాల్ టికెట్లను విద్యార్థులు ఆన్లైన్లో నేరుగా డౌన్లోడ్ చేసుకొని పరీక్షకు హాజరుకావచ్చు.
- కరీంనగర్ జిల్లాలో...
కరీంనగర్ జిల్లాలో 36,426 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా 57 ప రీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈసారి విద్యార్థుల సంఖ్య పెరగడంతో జిల్లాలో 57 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
- పెద్దపల్లి జిల్లాలో...
పెద్దపల్లి జిల్లాలో 22 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 10,367 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 2 ప్లైయింగ్ స్క్వాడ్స్, ఒక సిట్టింగ్ స్క్వాడ్ బృం దాలను నియమించారు.
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 16 పరీ క్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 8,106 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.
- జగిత్యాల జిల్లాలో...
జగిత్యాల జిల్లాలో మొత్తం 30 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 15,125 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.
- విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలి...
- జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలను చేరుకొని ప్రశాంతంగా పరీక్షలు రాయాలి. విద్యార్థులు నేరుగా వ్బుసైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొని పరీక్ష రాయవచ్చు.
కరీంనగర్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వి గంగాధర్




