9 April, 2026 | 6:29 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

దోమకొండలో జెండర్ అవగాహన శిక్షణ కార్యక్రమం విజయవంతం

09-04-2026 04:50 PM

కామారెడ్డి అర్బన్, ఏప్రిల్ 9(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల సమాఖ్య కార్యాలయంలో గురువారం జెండర్ అంశంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి గ్రామపంచాయతీ నుంచి ఒక్కో జెండర్ పాయింట్ పర్సన్‌గా మొత్తం 29 మంది పాల్గొన్నారు. గ్రామాల్లో హింసలేని కుటుంబాల నిర్మాణం, అంటరానితనం నిర్మూలన, జననం-మరణం నమోదు ప్రాధాన్యత, బాల్య వివాహాల నివారణ, బాల కార్మికుల నిర్మూలన, మూఢనమ్మకాలపై అవగాహన కల్పించారు.

జెండర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ లింగ గౌడ్ సమాన పనికి సమాన వేతనం, కుటుంబాలకు అదనపు ఆదాయం అవసరం వంటి అంశాలను వివరించారు. ఎస్ఐ ప్రభాకర్ మానవ అక్రమ రవాణా నిర్మూలనపై మాట్లాడగా, ఐసిడిఎస్ సూపర్వైజర్ సుప్రియ బాల్య వివాహాల నివారణపై సూచనలు చేశారు. మహిళా సంఘాల అభివృద్ధికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఏపిడీ విజయలక్ష్మి, ఐబీ డీపీఎం శ్రీనివాస్, మండల సమాఖ్య సభ్యులు, ఏపీఎం శ్రీనివాస్ లు, సీసీలు, ఎంఎస్ఏ సభ్యులు పాల్గొన్నారు.