లింగనిర్ధారణ పరీక్షలు నేరం
12-06-2024 12:35 AM
జిల్లావైద్యారోగ్యశాఖ ఉప అధికారి రజిత
రాజన్న సిరిసిల్ల, జూన్ 11 (విజయక్రాం తి): స్కానింగ్ సెంట్లర్లలో లింగనిర్దారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని రాజన్న సిరిసిల్ల వైద్యారోగ్య శాఖ ఉపఅధికారి రజిత తెలిపారు. జిల్లాలోని అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లలో మంగళవారం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్కానింగ్ సెం టర్లలో ఫార్మ్ ఎఫ్ లో గర్భిణుల పూర్తి వివరాలు, స్కానింగ్ చేయడానికి గల కారణా లను పొందుపరుచాలని సూచించారు. లింగనిర్దారణ పరీక్షలు చేస్తే మూడేళ్ల జైలు, రూ.10 వేల జరిమానా విధిస్తారని హెచ్చరించారు.






